జనవరి 1 నుంచి అమల్లోకి భూ భారతి
రాష్ట్రంలో జనవరి 1 నుంచి అందుబాటులోకి భూ భారతి పోర్టల్ రానుంది
తెలంగాణలో జనవరి 1 నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి రానుందని తెలుస్తోంది. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి ఎన్‌ఐసీ భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో నిర్వహణ ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ కానుంది. తద్వారా ధరణి ఆసరాతో కొల్లగొట్టిన భూముల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం భావిస్తుంది.
ధరణి భూ కుంభకోణాల్లో ప్రభుత్వ పెద్దల పాత్రతోపాటు రెవెన్యూ కీలక అధికారుల పాత్రను గుర్తించనున్నారు. అర్థరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు..ఏ సర్వర్ నుండి ఏ ఐపి అడ్రస్ అయ్యారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు అనే అంశాలపై ఫోకస్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో… ధరణి లావా దేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు సమాచారం అందుతోంది.