Telugu Global
Telangana

హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు ఎందుకంటే?

ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణపై కేసు నమోదు అయింది.

హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు ఎందుకంటే?
X

ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణపై కేసు నమోదు అయింది. వేణు సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మధ్యలోనే తప్పుకుంది.. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా.. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌ సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు.

First Published:  5 Feb 2025 4:40 PM IST
Next Story