త్రిష లాంటి క్రీడాకారులు తెలంగాణకు గర్వకారణం
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
మలేషియాలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఇండియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆలౌ రౌండ్ ప్రతిభతో అద్భుత ఆటను ప్రదర్శించారు. దూకుడు గా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక రన్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. త్రిష లాంటి క్రీడాకారులు తెలంగాణకు గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. త్రిష మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.