Telugu Global
Telangana

భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది.

భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X

భూభారతి బిల్లుకు తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది. భూ సమస్యల నివారణకు ప్రభుత్వం ఈ నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్నఆర్వోఆర్‌-2020ను స్ధానంలో కొత్తగా భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పేరుతో తీసుకొచ్చిన బిల్లును మంత్రి సభ ముందు ఉంచారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. అంతకుముందు.. భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుందని.. గ్రామాల్లో భూమి ప్రధాన జీవన ఆధారమని మంత్రి పొంగులేటి అన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పారు.

అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లోని సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారని అన్నారు సీఎం రేవంత్. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ హైలాండ్స్ వంటి దేశాలకు రైతుల సమాచారం వెళ్లిందని తెలిపారు. ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్ళినా సీఈఓ గా గాదే శ్రీధర్ రాజే ఉన్నారని పేర్కొన్నారు. శ్రీధర్ రాజు ద్వారా విదేశాలకు సమాచారాన్ని పంపించారని ఆరోపించారు. అత్యంత సున్నితమైన సమాచారాన్ని విదేశీయుల చేతిలో పెట్టారని.. ఈ తీవ్రమైన నేరానికి పాల్పడిన బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలన్నారు. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరిన వారు సహకరించడం లేదని తెలిపారు సీఎం రేవంత్.

First Published:  20 Dec 2024 4:35 PM IST
Next Story