నేడు ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభం
సోమవారం జూపార్కు ఎదురుగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆరాంఘర్-బహదూర్‌పుర జూపార్కు వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జూపార్కు ఎదురుగా ప్రారంభించనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా.. తమ పరిధిలో కార్యక్రమం చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీ అసదుద్దీన్ వర్గాలు పట్టుబట్టడంతో వాయిదాపడినట్లు తెలుస్తోంది.
నగరంలోనే ఈ ఫ్లైఓవర్ రెండో అతిపెద్దది. దీనిని 3.9 కిలోమీటర్లు, ఆరులైన్లతో విస్తరించారు. ఎస్‌ఆర్‌డీపీ నిధులు రూ.360 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణతో కలిపి రూ. 799 కోట్ల వ్యయం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ నుంచి మరో ఎగువ మార్గంలో పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు నేషనల్ హైవే మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉన్నది. దూర ప్రయాణం చేసే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఓల్డ్ సిటీ ప్రజలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలంటే నగరం దాటి పీవీఎన్‌ఆర్ వంతెనను ఆశ్రయించేవారు.