సచివాలయంలో మరోసారి భద్రతా లోపం
తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది.
తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు సచివాలయ భద్రతా సిబ్బంది. తహసీల్దార్ పేరిట సచివాలయంలోకి వచ్చిన కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్ అనే స్టిక్కర్ వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి వస్తున్న అంజయ్య అనుమానం రావడంతో ఈ రోజు అంజయ్యను సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.
దాంతో అనుమానం వచ్చి ఈ రోజు అంజయ్య ను పట్టుకున్నారు సచివాలయం సెక్యూరిటీ. అనంతరం అంజయ్యను సైఫాబాద్ పోలీసులకు అప్పగించి.. అతని పై కేసు నమోదు చేసారు. అంజయ్య వద్ద నుంచి ఫేక్ ఐడి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఓ జిరాక్స్ సెంటర్ లో ఈ ఫేక్ ఐడి కార్డ్ తయారు చేపించినట్లు పోలీస్ విచారణలో అంజయ్య తెలిపాడు . దీంతో ఈ ఫేక్ ఉద్యోగి దందాల పై పోలీసులు విచారణ మొదటు పెట్టారు