అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామం
నటుడు అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది.హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమీషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా ఎన్‌హెచ్‌ఆర్సీ స్వీకరించింది. దీంతో తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. సంథ్య థియేటర్ వద్ద జరిగిన లాఠీఛార్జి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.‘
పుష్పా-2’ సినిమా సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో బన్నీను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ దుమారం చెలరేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమైంది. ప్రస్తుతం ఈ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది.