Telugu Global
Telangana

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నీటి సరఫరా బంద్

హైదరాబాద్‌ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నీటి సరఫరా బంద్
X

హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 11న పలు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్‌బే, మీరాలం ఫిల్టర్ బెడ్స్, సెటిల్లింగ్ ట్యాంక్‌లు ,ఇన్‌లెట్ ఛానెళ్లను శుభ్రపరిచే పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ప్రకటించింది.

ఈ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ సరఫరాకు పూర్తి అంతరాయం ఏర్పడుతుందని… మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఉంటుందని తెలిపింది. హ‌స‌న్‌న‌గ‌ర్‌, కిష‌న్ బాగ్‌, దూద్‌బౌలి, మిస్రిగంజ్, ప‌త్త‌ర్‌ఘ‌టి, దారుల్‌షిఫా, మొఘ‌ల్‌పురా, జ‌హ‌నుమా, చందులాల్ బ‌ర‌ద‌రి, ఫ‌ల‌క్‌నుమా, జంగంమెట్ ఏరియాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలో ఈ ప్రాంతాల ప్ర‌జ‌లు నీటిని త‌క్కువ‌గా వినియోగించాల‌ని అధికారులు సూచించారు.

First Published:  8 Jan 2025 7:13 PM IST
Next Story