Telugu Global
Telangana

కాంగ్రెస్‌ పార్టీకి షాక్..మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి షాక్..మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్‌బై
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటానని వెల్లడించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే కోనేరు కోనప్ప రాజీనామాకు దారి తీశాయని తెలుస్తోంది. నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం పట్ల మాజీ సీఎం కేసీఆర్‌తో విభేదించారు. గ‌త ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ నేత అర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి కోనేరు కోనప్ప నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై కోనప్ప విజయం సాధించారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఏడాది గడవకుండానే కోనప్ప హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు.

First Published:  21 Feb 2025 3:03 PM IST
Next Story