బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం
కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది.
కరీంనగర్ కలెక్టర్‌లో నిర్వహించిన మంత్రుల సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. అనంతరం బయటకు వచ్చి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 50 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. వెంటనే మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చినట్లు గుర్తుచేశారు. తక్షణమే రెండో విడత దళితబంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. తాము రైతుల పక్షాన నిలబడతామని అన్నారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని నిలదీశారు. వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.