Telugu Global
Telangana

కేటీఆర్‌పై అన్యాయంగా కేసు నమోదు చేశారు : హారీశ్‌రావు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హారీశ్‌రావు ఖండించారు.

కేటీఆర్‌పై అన్యాయంగా కేసు నమోదు చేశారు :  హారీశ్‌రావు
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హారీశ్‌రావు ఖండించారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కేటీఆర్‌పై కేసు నమోదును ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు కోసం పనిచేస్తే కేసు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని అన్నారు. ఫార్ములా ఈ కార్‌ ద్వారా రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు పని చేస్తే కేసులు పెడుతున్నారని హారీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పేది నిజమైతే రేపు లేదా ఎల్లుండి శాసన సభలో చర్చకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఫార్ములా ఈ కార్‌ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

First Published:  19 Dec 2024 5:00 PM IST
Next Story