తెలంగాణలో 12 మంది అదనపు డీసీపీలకు పదోన్నతి
తెలంగాణలో 12 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్రం ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
తెలంగాణలో 12 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్రం ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో సైబరాబాద్ అదనపు డీసీపీ(క్రైమ్స్-I)కు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతి పొందిన అదనపు డీసీపీలు వీళ్లే..
కె.గుణశేఖర్ – మేడ్చల్ డీసీపీ (ట్రాఫిక్)
జి.నరసింహారెడ్డి – రాచకొండ డీసీపీ ( స్పెషల్ బ్రాంచ్)
ఎస్.మల్లారెడ్డి – రాచకొండ డీసీపీ (ట్రాఫిక్)
మద్దిపాటి శ్రీనివాస రావు – సీఐడీ ఎస్పీ
పి.శోభన్ కుమార్ – మాదాపూర్ డీసీపీ(ఎస్‌వోటీ)
టి. సాయి మనోహర్ – మాదాపూర్ డీసీపీ (ట్రాఫిక్)
డి.రమేశ్ – ఎస్పీ (ఇంటెలిజెన్స్)
జే.చెన్నయ్య – ఐసీసీసీ హైదరాబాద్ ఎస్పీ
పి.విజయ్‌కుమార్ – సీఐడీ ఎస్పీ
కె.మనోహర్ – రాచకొండ డీసీపీ (రోడ్ సేఫ్టీ)
డి.శ్రీనివాస్ – మేడ్చల్ డీసీపీ (ఎస్‌వోటీ)
పి.కరుణాకర్ -(డీజీపీకి రిపోర్ట్)