YSRCP

వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.

ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.

వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను ‘స్కిల్ సెన్సెస్’ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ట్వీట్ వేశారు. ఫొటోలు కూడా జతచేశారు.

మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.

సివిల్‌ వర్క్స్‌ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు జగన్. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.