ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రకరకాల అనారోగ్యాలు తగ్గడంతోపాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
Walking
నడుం నొప్పి సమస్యకు నడక ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.
మరీ ఎండ ఎక్కువ అయినప్పుడు కాకుండా తెల్లవారు జామున వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.
తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చలిగా ఉన్నప్పుడు స్వెటర్లు, టోపీల వంటివి వాడుతూ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
శీతాకాలంలో నడవడం అనేది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రోత్సహిస్తుంది, దీనితో ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ వాకింగ్ చేయటం వలన ఎన్నోరకాలుగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత పెరుగుతాయి.