Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, June 25
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    రోజుకి పదివేల అడుగులు… ఇతర వ్యాయామాలు అక్కర్లేదా?

    By Telugu GlobalSeptember 26, 2023Updated:March 30, 20252 Mins Read
    రోజుకి పదివేల అడుగులు... ఇతర వ్యాయామాలు అక్కర్లేదా?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    రోజూ వాకింగ్ చేయటం వలన ఎన్నోరకాలుగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మకత పెరుగుతాయి. శరీరం, మనసు రెండింటికీ ఒకేసారి ప్రయోజనాన్ని ఇచ్చే వ్యాయామాల్లో వాకింగ్ ప్రధానమైనది. రోజుకి పదివేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి అదే పదివేలు అని చెప్పవచ్చు. రోజుకి పదివేల అడుగులు నడవగలిగితే అది ఆరోగ్యవంతమైన జీవనశైలికి పునాదిగా మారుతుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నాక వాకింగ్ చేసేవారు ఇతర వ్యాయామాలు, వర్కవుట్లు చేయకపోయినా పర్వాలేదా… అనే సందేహం కలుగుతుంది కదా… వాకింగ్ తో గుండెకు ఎంతో ప్రయోజనం ఉన్నప్పటికీ అది వర్కవుట్లు చేసినప్పుడు లభించినంత స్థాయిలో శ్రమ, వ్యాయామాలను శరీరానికి అందించదని కనుక నడకతో పాటు ఇతర వ్యాయామాలు కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు.

    వాకింగ్ తో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరెన్నో రకాల లాభాలు నడకతో ఉన్నా శారీరక ఆరోగ్యం, ఫిట్ నెస్ లను పూర్తిస్థాయిలో పొందాలని అనుకునేవారు వాకింగ్ తో పాటు ఏరోబిక్ వర్కవుట్లు, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి ఇతర వ్యాయామాలను సైతం చేయటం మంచిది. అయితే గుండె ఆరోగ్యానికి మాత్రం వాకింగ్ తప్పనిసరి అని గుండెవ్యాధుల నిపుణులు సలహా ఇస్తున్నారు. అంటే ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా గుండె ఆరోగ్యం కోసం నడకని తప్పకుండా తమ ఫిట్ నెస్ రొటీన్ లో భాగం చేసుకోవాలి.

    నడకతో గుండె పదిలం

    వాకింగ్ వలన గుండె కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం సైతం పెరుగుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

    చెడు కొలెస్ట్రాల్ కి చెక్

    రోజువారీ వాకింగ్ చేసేవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంటే వాకింగ్ తో చెడు కొలెస్ట్రాల్ వలన గుండె అనారోగ్యాల పాలు కాకుండా నివారించవచ్చు.

    బరువు అదుపులో

    శరీర బరువుని తగ్గించడంలో వాకింగ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు పెరగటం వలన వచ్చే గుండెవ్యాధులను వాకింగ్ నివారిస్తుంది.

    రక్తంలో చెక్కర క్రమబద్ధంగా…

    వాకింగ్ వలన రక్తంలో చెక్కర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. దీనివలన టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉండదు. టైప్ టు డయాబెటిస్ కూడా గుండెవ్యాధులకు కారణమవుతుంది కనుక నడక ఈ విధంగా కూడా గుండెకు మేలు చేస్తుంది.

    ఒత్తిడిని తగ్గిస్తుంది

    నడకతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది సహజమైన ఒత్తిడి నివారణ సాధనంగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నవారు నడకతో దానిని తగ్గించుకుంటే గుండెకు మేలు చేసుకున్నట్టే అవుతుంది.

    health tips Walking
    Previous Articleనన్ను తీసుకెళ్లండి ప్లీజ్..! (స్కెచ్)
    Next Article iPhone with Gold | ప‌సిడితో ఐ-ఫోన్‌15 సిరీస్ ఫోన్లు.. సెల‌బ్రిటీల కోసం ఇలా.. లిమిటెడ్ ఆఫ‌ర్ ఓన్లీ..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.