OTT Telugu Movies releases this week: ఈ వారం బాలీవుడ్ నటులు రితీష్ దేశ్‌ముఖ్, సోనాక్షీ సిన్హా, సాకీబ్ సలీం లు నటించిన ‘కాకుడా’ అనే హార్రర్ కామెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
OTT,OTT Movies Telugu
ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు మీ కోసం. తమిళం, మలయాళం, హాలీవుడ్ సినిమాలు, హిందీ, ఇంగ్లీషు, కొరియన్ వెబ్ సిరీసులు, షోలు, బయోపిక్ లు కొలువుదీరాయి.
ఈ వారం తాజా ఓటీటీ విడుదలల్లో మన సినిమాల్లేవు. రెండు హిందీ వెబ్ మూవీస్ వున్నాయి. వీటిలో ‘రౌతూ కా రాజ్’ పేరుతో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన సరికొత్త క్రైమ్ కామెడీ ఆసక్తికర కథతో వుంది.
ఈవారం అనురాగ్ కశ్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ సేథీలు నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘బాడ్ కాప్’ ఒక చెప్పుకోదగ్గ కాలక్షేపం అనుకోవచ్చు.
‘ప్రసన్న వదనం’, ‘రత్నం’, ‘క్రూ’, ‘ది కర్దాషియన్స్ సీజన్ 5’ , ‘అట్లాస్’, ‘బైయింగ్ లండన్’, ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’…ఇంకా మరెన్నో వినోదాత్మక టైటిల్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నాణ్యమైన కంటెంట్ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీ సర్వీసుల్లో విరివిగా లభిస్తోంది.
ఈ వారం బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనే, హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ తో కలిసి నటించిన యాక్షన్ మూవీ ‘ XXX: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ప్రత్యేకాకర్షణగా వుంది. ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇతర కొత్త ఓటీటీ విడుదల్లో ‘అన్ దేఖీ’ హిందీ సీజన్ 3 తో బాటు, ‘ఆవేశం’ సినిమ కూడా వుంది.
తెలుగు సినిమాలు ‘టిల్లూ స్క్వేర్’, ‘భీమా’ ఇక ఓటీటీలో చూడొచ్చు. ఇంకా హాలీవుడ్ యాక్షన్ హీరో జేసన్ స్టాథమ్ నటించిన ‘ది బీకీపర్’, జపనీస్ థ్రిల్లర్ మూవీ ‘సిటీ హంటర్’, స్వీడన్ క్రైమ్ డ్రామా ‘డెలివర్ మీ’, బెంగాలీ లీగల్ థ్రిల్లర్ ‘అడ్వొకేట్ అచింత ఐచ్’ మొదలైనవి వారమంతా మిమ్మల్ని అలరిస్తాయి.