Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, July 7
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ : బోలెడు సినిమాలు, షోలు!

    By Telugu GlobalMay 14, 20244 Mins Read
    ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్ : బోలెడు సినిమాలు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    నాణ్యమైన కంటెంట్ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీ సర్వీసుల్లో విరివిగా లభిస్తోంది. ఈ వైవిధ్యంతో కూడిన కంటెంట్ ని ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. ఈ వైవిధ్యం, వెసులుబాటు టీవీ ఛానెల్స్ లో కూడా లభించదు. పైగా జియో ఫైబర్ సంస్థ సరికొత్తగా స్ట్రీమింగ్ సర్వీసుల కోసం ఓ చవకైన ప్లాను ప్రవేశపెట్టింది. జియో అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాను పేర- కస్టమర్ల కోసం చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో ఒకదాన్ని ప్రవేశపెట్టింది. నెలకు రూ. 888 అల్టిమేట్ చెల్లించి అపరిమిత డేటా యాక్సెస్‌ని పొందవచ్చు. డేటా స్పీడు 30 ఎంబీపీఎస్ వుంటుంది. దీంతోబాటు 15 కి పైగా ఓటీటీ సర్వీసులకి ఉచిత సభ్యత్వాలని పొందవచ్చు. వీటిలో నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ వీడియో (లైట్), జియోసినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 ప్రీమియం, సన్ నెక్స్ట్, హోయిచోయి, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఇరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షెమారూ మీ, డాక్యూ బే, ఎపికాన్, ఈటీవీ విన్ జియో టీవీ ప్లస్ వుంటాయి. ఈ చవక ప్లానుతో స్ట్రీమింగ్ యాక్సెస్ ఉచితంగా మారిపోవడంతో వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ క్రింది కంటెంట్ ని ఎంజాయ్ చేయడమే!

    1. జర హట్కే జర బచ్కే (మే 12) – జియో సినిమా

    విక్కీ కౌశల్ -సారా అలీ ఖాన్ నటించిన ‘జర హాట్కే జర బచ్కే’ హిందీ రోమాంటిక్ కామెడీ హిట్ మూవీ 2023 జూన్ లో విడుదలై దాదాపు ఏడాది ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ సొంత ఇల్లు కావాలనుకునే ఓ పట్టణ జంట చుట్టూ తిరుగుతుంది. దీనికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. దీనిని మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ కలిసి నిర్మించారు.

    2. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ (మే 13)- అమెజాన్ ప్రైమ్

    ఇది ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన అమెరికన్ యాక్షన్ సినిమా. లెజెండరీ పిక్చర్స్ నిర్మాణం, వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేపట్టాయి. మెటావర్స్ ఫ్రాంచైజీలో ఐదవ భాగంగా, గాడ్జిల్లా ఫ్రాంచైజ్ లో 38వ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటే కింగ్ కాంగ్ ఫ్రాంచైజీలో పదమూడవది. ఇందులో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ కీలక పాత్రలు పోషించారు.

    3. బ్రిడ్జ్ టన్ సీజన్ 3: పార్ట్ 1 (మే 13) – నెట్‌ఫ్లిక్స్

    ఈ సిరీస్ మొదటి సీజన్‌లో హైలైట్ అయిన పెనెలోప్ ఫెదరింగ్టన్ – కోలిన్ బ్రిడ్జర్టన్ ల ప్రేమకథని ముందుకు తీసుకువెళుతుంది. కోలిన్ పెనెలోప్‌కి భర్త పట్ల వున్న ప్రేమని చిత్రిస్తుంది.

    4. బ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 2 (మే 16 ) – నెట్ ఫ్లిక్స్

    ఈ రెండవ సీజన్‌లో జ్యూస్ మరణం తర్వాత ఖగోళ సోపానక్రమానికి అంతరాయం కలుగుతుంది. తద్వారా మౌంట్ ఒలింపస్ తో అధికార పోరాటం ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని చూసుకుని హేడిస్ పాతాళం నుంచి విముక్తి పొందేందుకు, ఖాళీ చేసిన సింహాసనాన్ని అధిరోహించడానికీ ఒక పన్నాగాన్ని రూపొందిస్తాడు. ఇలా దైవిక సంఘర్షణలు తీవ్రమవుతున్న కొద్దీ, అవి విశ్వం ఉనికికే ప్రమాదకరంగా మారతాయి.

    5. మేడమ్ వెబ్ (మే 16)- నెట్ ఫ్లిక్స్

    ఈ మార్వెల్ మూవీలో డకోటా జాన్సన్ నటించింది. తన జీవితాన్ని మార్చే పరీక్ష ద్వారా మానసిక ప్రతిభని వెలికితీసే కథ ఇది. ఆమె భవిష్యత్తుని గాంచే అసాధారణ సామర్థ్యాలకు అనుగుణంగా జీవితాన్ని మల్చుకుంటుంది. తన దివ్యదృష్టి శక్తుల్నిపంచుకునే శత్రువు అయిన ఎజెకిల్ సిమ్స్ తో ప్రమాదకరమైన ఘర్షణకి దారితీస్తుంది. తన సామర్థ్యాల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సిమ్స్ నుంచి ముప్పులో వున్న స్పైడర్-ఉమెన్‌గా మారడానికి ఉద్దేశించిన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలకి సంరక్షకురాలి పాత్రలో అడుగు పెడుతుంది. ఈ మూవీ సోనీ స్పైడర్ మ్యాన్ వయూనివర్స్ లో నాల్గవ ఎంట్రీ.

    6. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (మే 17)- డిస్నీ ప్లస్ హాట్ స్టార్

    ఇది అమరేంద్ర బాహుబలి– భల్లాలదేవల ప్రారంభ కథని అన్వేషించే ఐకానిక్ మూవీ ‘బాహుబలి’ కి యానిమేటెడ్ సిరీస్ ప్రీక్వెల్. దుర్మార్గుడైన యోధుడు రక్తదేవుడికి వ్యతిరేకంగా సోదరులు ఏకమవుతారు. రక్తదేవుడు మహిష్మతి రాజ్యాన్ని బెదిరిస్తాడు. ఇద్దరూ తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. విధేయత, ద్రోహం, అధికార పోరాటాల ద్వారా కీలక సంఘటనల్ని బహిర్గతం చేసే పీరియడ్ డ్రామా ఇది.

    7. బస్తర్: ది నక్సల్ స్టోరీ (మే 17) – జీ5

    ఇది సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన హిందీ-భాషా నక్సల్- రాజకీయ థ్రిల్లర్. విపుల్ అమృతలాల్ షా నిర్మాత. అదా శర్మ పోలీసాఫీసర్ గా ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఆమెతో పాటు ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, శిల్పా శుక్లా, యశ్పాల్ శర్మ, సుబ్రత్ దత్తా, రైమా సేన్ కూడా ఇందులో నటించారు. మార్చి 15, 2024న థియేటర్‌లలో విడుదలైంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 3 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది.

    8. ది 8 షో (మే 17) – నెట్ ఫ్లిక్స్

    దక్షిణ కొరియా డార్క్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఒక ఎనిమిది అంతస్తుల భవనంలో చిక్కుకున్నఎనిమిది మంది వ్యక్తుల తీవ్రమైన సంఘర్షణని వివరిస్తుంది.

    9. ది బిగ్ సిగార్ (మే 17)- ఆపిల్ ప్లస్ టీవీ

    ఇది బ్లాక్ పాంథర్ పార్టీ సహ-వ్యవస్థాపకుడు హ్యూయ్ న్యూటన్ ఉల్లాసకరమైన, ధైర్యసాహసాలతో కూడిన కథని వివరించే ఆకర్షణీయ పరిమిత సిరీస్. హాలీవుడ్ నిర్మాత బెర్ట్ ష్నీడర్‌తో పాటు, న్యూటన్ కల్పిత చలనచిత్ర నిర్మాణం ముసుగులో సాహసోపేత, సంక్లిష్ట పథకాన్ని రూపొందిస్తాడు. ఈ విస్తృత ప్రణాళిక ఎఫ్బీఐ నుంచి తప్పించుకోవడానికి, తర్వాత క్యూబాకు పారిపోవడానికీ వీలుగా రూపొందిస్తాడు.

    10. విద్యా వాసుల అహం (మే 17)- ఆహా

    రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ లు జంటగా నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది. ఓ ఫీల్ గుడ్ మూవీ సరదాగా చూసేయ వచ్చు.

    11. తలైమై సేయలగం (మే17)- జీ5

    నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొంది రూపండించిన రాజకీయ వెబ్ సిరీస్ ఇది.

    మరికొన్ని సినిమాలు, షోలు…

    నెట్‌ఫ్లిక్స్ లో

    1. ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 15

    2. పవర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17

    3. థెల్మా ది యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17

    అమెజాన్ ప్రైమ్ లో

    1. ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) -మే 16

    2. 99 (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో

    1. క్రాష్ (కొరియన్ సిరీస్) – మే 13

    2. చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14

    3. అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) – మే 15

    జియో సినిమాలో

    1. డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) – మే 13

    2. C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – మే 14

    3. ది న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13

    సోనీ లివ్ లో

    1. లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16

    ఎమ్ఎక్స్ ప్లేయర్ లో

    1. ఎల్లా (హిందీ సినిమా) – మే 17

    OTT,OTT Movies Telugu
    Previous Articleనైరుతి.. ఈసారి ముందుగానే..
    Next Article భారత 85వ గ్రాండ్మాస్టర్ గా శ్యామా నిఖిల్!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.