Chandrababu Naidu

నిరుపేద మైనార్టీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2015 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మైనార్టీల వివాహాలకు ప్రభుత్వం 50 వేల రూపాయల సహాయం చేసేది. అయితే ఎన్నికల సమయంలో దుల్హన్ పథకాన్ని కొనసాగించడమే కాక 50 వేలకు బదులు లక్షరూపాయలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆ పథ‌కాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న […]

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్న లక్ష్యం కాదు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతోంది. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో.. లక్షకు తగ్గని మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆ మెజార్టీని 30 వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి బాబును పంపేయడమే లక్ష్యంగా […]

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిస్థితి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఒకరికి ఆహ్వానం లేదు, ఇంకొకరికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. ఈ దశలో వీరిద్దర్నీ టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీతో కలసి వేదికను పంచుకున్న ఆమె సెల్ఫీ దిగి సందడి చేశారు, ఆ తర్వాత బాబు, పవన్ కి చాకిరేవు పెట్టారు. విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో […]

తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం […]

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా అంటూ ఫేక్ పోస్ట్.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ అంటూ మరో ఫేక్ పోస్ట్.. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తాం, వాలంటీర్లను తీసేస్తామంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్టు మరో ఫేక్ పోస్ట్.. ఇదీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఫేక్ రాజకీయం. ఎవరు ఈ పోస్ట్ లు క్రియేట్ చేస్తారు, ఎవరు వాటిని షేర్ చేస్తారు, అసలు ఇలాంటి వాటి వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం అనే విషయాలు […]

ఏపీలో కల్తీ మద్యం అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆయన ఓ కల్తీ నాయుడు, కల్తీ నాయకుడని సెటైర్లు వేశారు నాని. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు నాని. మీరు తాగి పంపించారా..? గోబెల్స్‌ ప్రచారానికి తాత చంద్రబాబేనంటూ ధ్వజమెత్తిన […]