మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు కానీ, అదే పార్టీలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఆయన పల్లెత్తు మాట అనలేదు. నందమూరి కుటుంబంపై తనకు గౌరవం ఉందని ఆయన చాలా సార్లు బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. కానీ తొలిసారిగా ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరిపై సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. గుడివాడ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలందరికోసం ఆలోచించాలి కానీ, కేవలం 10మంది […]
AP
ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ నేతలపైనా పోరాటానికి వెనుకాడడం లేదు. మాజీ మంత్రిపేర్ని నాని సిఫార్సు మేరకు విక్టర్ ప్రసాద్‌ను జగన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారని చెబుతుంటారు. దళితుల పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి కావడమూ ఆయనకు కలిసి వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నా పదవిలోకి వచ్చిన తర్వాత.. ఎస్సీలకు న్యాయం చేసే విషయంలో వైసీపీ పెద్దలనూ ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నారు. ఇది రాజ్యాంగ […]
పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించేందుకే నారా లోకేష్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పిల్లలతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి తాను వెళ్లడంపై కొడాలి స్పందించారు. నారా లోకేష్‌ను కొన్ని ప్రశ్నలు అడగాలనే తాను జూమ్‌లోకి వెళ్లానని..కానీ తనను చూడగానే కట్ చేసుకుని పారిపోయారన్నారు. ఫెయిల్ అయిన వారికి ధైర్యం చెప్పాల్సిందిపోయి.. ఇక మీ పని అయిపోయింది, ఆత్మహత్యలే దిక్కు అన్నట్టుగా లోకేష్ ప్రేరిస్తున్నారన్నారు. […]
ఏపీలో టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 67.26 శాతం మంది పాస్ అయ్యారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు పరీక్ష తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లోపు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాజాగా […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకువచ్చారని విమర్శించారు. రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?, ఆ ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారని.. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అప్పు ఎంత ఉందో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ […]
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తుల విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అప్పటినుంచి పవన్ కల్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు బీజేపీ తమ అధినేతను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ జనసైనికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. బీజేపీ మనసులో ఏముందో తెలియడం లేదు. పవన్‌తో పొత్తుకు తాము సిద్ధమేనంటున్న బీజేపీ నేతలు.. సీఎం అభ్యర్థి ప్రకటన విషయంపై స్పందించడం లేదు. ఇదిలా […]
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పొరునున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిషా కంటే ముందుగా ఏపీలోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణం కరోనా వల్ల సరైన కోచింగ్ అందకపోవడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామన్నారు. శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. […]
ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే.. సీక్రెట్లు కనిపెట్టడంలో మోడీ, అమిత్ షా కంటే తానే తెలివైన వాడిని అని విష్ణువర్థన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఉంది. మైండ్ గేమ్‌లో భాగంగానే జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారన్నది విష్ణు ఆరోపణ. ఆత్మకూరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో పాటు.. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాల ఏపీ పర్యాటన ఖరారైన సమయంలోనే జగన్ […]
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు కానీ, పార్టీకోసం పనిచేస్తానంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ ని తాడేపల్లికి పిలిపించుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సిన టైమ్ లో విశాఖ దక్షిణ నియోజకవర్గం పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. నష్టనివారణ చర్యలు.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే […]
మాజీ మంత్రి పుష్పశ్రీవాణి అలక అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇదే చానల్ గతంలోనూ తనకు వ్యతిరేకంగా ఇలాంటి కథనాలే రాసిందన్నారు. అప్పుడు తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ప్రసారం చేసిన కథనంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై తాను అలిగానని చెప్పారు కాబట్టే స్పందించాల్సి వస్తోందన్నారు. ఎల్లో మీడియా అనుకుంటున్నట్టు తాను పెయిడ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ కాదని.. జగన్ కోసం ప్రాణాలిచ్చే బ్యాచ్ అని ఆమె చెప్పారు. జగన్ ఏ […]