న్యూజిలాండ్ తో ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 72 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే వికెట్ల ముందు కుదురు కోవడం మినహా భారత బ్యాటర్ల ముందు ఇంకో ఆప్షన్ లేదు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 52 బంతుల్లో ఆరు ఫోర్లతో 32 పరుగులు చేసి పటేల్ బౌలింగ్ లో బ్లండెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 37 పరుగులు, విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండా క్రీజ్ లో ఉన్నారు. భారత జట్టు 19.3 ఔవర్లలో వికెట్ నష్టపోయి 74 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ జట్టు భారత్ పై ఇంకా 282 పరుగుల ఆదిక్యంలో ఉంది.
Previous Articleసుప్రీంకోర్టులో ఇక అన్నికేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్‌లో
Next Article జానీ మాస్టర్ పై ఆనీ మాస్టర్ సంచలన కామెంట్స్ !
Keep Reading
Add A Comment