ప్లే-అఫ్ రౌండ్ కు చెన్నై చేరేదెలా?
ఐపీఎల్-17వ సీజన్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే -ఆఫ్- రౌండ్ చేరటం అనుమానంగా మారింది.
ఐపీఎల్-17వ సీజన్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే -ఆఫ్- రౌండ్ చేరటం అనుమానంగా మారింది.
దేశవ్యాప్తంగా 10 నగరాలలోని 11 వేదికల్లో జరుగుతున్న 2024 ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశలోని మొదటి 10 రౌండ్ల పోటీలు ముగిసేనాటికి...గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్,రన్నరప్ గుజరాత్ టైటాన్స్, ఐదుసార్లు విజేత ముంబై, మాజీ రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయాయి.
రాజస్థాన్ టాప్...ముంబై ఫ్లాప్....
మొదటి 10 రౌండ్ల మ్యాచ్ ల్లో 8 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్ గా..ప్లే-ఆఫ్ రౌండ్ కు గెలుపు దూరంలో నిలిచింది.
కోల్ కతా నైట్ రైడర్స్ 10 రౌండ్లలో 7 విజయాలు, 3 పరాజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 2వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ చెరో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 3, 4 స్థానాలలో కొనసాగుతున్నాయి.
అయితే..డిఫెండింగ్ చాంపియన్, ఐదుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ 10 రౌండ్లలో 5 విజయాలు, 5 పరాజయాలతో 10 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
ఆఖరి 4 రౌండ్లలో 3 మ్యాచ్ లు నెగ్గితేనే...
ప్రస్తుత చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చివరి నాలుగురౌండ్లలో 3 విజయాలు సాధించగలిగితేనే ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఏ రెండుమ్యాచ్ లు ఓడినా..చెన్నై ప్లే-ఆఫ్ రౌండ్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పదు.
ఇప్పటి వరకూ ఆడిన మొదటి 10 రౌండ్లలో బెంగళూరు, గుజరాత్ జట్లపైన నెగ్గిన చెన్నై ఆ తరువాతి రెండుమ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయాలు పొందిన ధోనీసేన..ఆతర్వాతి రెండు రౌండ్లలో కోల్ కతా, ముంబైజట్ల పైన విజయాలతో పుంజుకోగలిగింది. అయితే..లక్నో సూపర్ జెయింట్స్ తో రెండుకు రెండుమ్యాచ్ లు ఓడడంతో పాటు..పంజాబ్ కింగ్స్ చేతిలో సైతం చిత్తు కావడం కూడా ప్లే-ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చింది.
మూడుబెర్త్ ల కోసం ఐదుజట్ల పోరు....
మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 రౌండ్లలో 8 విజయాలు సాధించడం ద్వారా ఇప్పటికే ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగా..మిగిలిన మూడు బెర్త్ ల కోసం కోల్ కతా, హైదరాబాద్, చెన్నై, లక్నో, పంజాబ్ పోటీపడుతున్నాయి.
చివరి నాలుగు రౌండ్లలో కోల్ కతా, హైదరాబాద్, లక్నో కనీసం మూడు మ్యాచ్ లు నెగ్గగలిగితేనే ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతాయి. లీగ్ టేబుల్ 4వ స్థానం కోసం హైదరాబాద్- లక్నో జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది.
పైజట్ల అవకాశాలను బట్టి చూస్తుంటే..చెన్నై ప్లే-ఆఫ్ రౌండ్ చేరడం అంతతేలికగా కనిపించడం లేదు. అయితే సన్ రైజర్స్ పై లక్నో, కోల్ కతా పై లక్నో విజయాలు సాధించగలిగితే...చెన్నైకి అవకాశాలు మెరుగవుతాయి.
చెన్నైజట్టుకు హోంగ్రౌండ్ వేదికగా ఒకే ఒక్కమ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడాల్సి ఉంది. మిగిలిన నాలుగుమ్యాచ్ ల్లో చెన్నై చెలరేగిపోవాలంటే..బ్యాటింగ్ లో రితురాజ్, శివం దూబే, బౌలింగ్ లో ముస్తాఫిజుర్, పతిరన అత్యుత్తమంగా రాణించక తప్పని పరిస్థితి నెలకొంది.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి నాలుగు రౌండ్లలో అద్భుతాలు చేస్తుందా? ప్రతికూల పరిస్థితులను అధిగమించి వరుస విజయాలతో ప్లే-ఆఫ్ రౌండ్ చేరుతుందో? లేదో వేచి చూడాల్సిందే.