Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, May 17
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    ప్రపంచ టెన్నిస్ లో జోకోవిచ్ సరికొత్త చరిత్ర!

    By Telugu GlobalMay 4, 2024Updated:March 29, 20252 Mins Read
    ప్రపంచ టెన్నిస్ లో జోకోవిచ్ సరికొత్త చరిత్ర!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని జంట రికార్డులు నెలకొల్పాడు. 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు….

    37 ఏళ్ల లేటు వయసులో…

    ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్ లో జోకోవిచ్ 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..37 సంవత్సరాల వయసులో నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగిన మొనగాడిగా మరో రికార్డు సైతం సాధించాడు.

    ప్రపంచ పురుషుల టెన్నిస్ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల 321 రోజుల వయసులోనే పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డును గతంలోనే అధిగమించాడు. 37 సంవత్సరాల వయసులో సైతం టాప్ ర్యాంక్ లో కొనసాగడం ద్వారా తనపేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసుకోగలిగాడు.

    ఇప్పటి వరకూ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అత్యంత పెద్దవయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఆటగాడి రికార్డును జోకోవిచ్ అధిగమించాడు.

    423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన తొలి, ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

    2017 మే 22న 30 సంవత్సరాల వయసులో పడిన జోకోవిచ్ 31 టూర్ టైటిల్స్ గెలుచుకొన్నాడు. తాను సాధించిన 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ లో 12 టైటిల్స్ మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం. మొత్తం 40 ఏటీపీ మాస్టర్స్ విజయాలలో 10 టైటిల్స్ సైతం మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం.

    2011 నుంచి 2024 వరకూ….

    జోకోవిచ్ 24 సంవత్సరాల వయసులో ( 2011 జులై 4న ) తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ 22 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకొంటే…యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ 19 సంవత్సరాల వయసులోనే నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం విశేషం.

    2011 నుంచి 2024 మధ్యకాలంలో 423 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన ఏకైక ఆటగాడు జోకోవిచ్ మాత్రమే. రోజర్ ఫెదరర్ 310 వారాలపాటు నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా జోకోవిచ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

    గత కొద్దిరోజులుగా టాప్ ర్యాంకర్ గా ఉన్న యానిక్ సిన్నర్ మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ నుంచి ఉపసంహరించుకోడంతో…రెండోర్యాంక్ లో కొనసాగుతున్న సెర్బియన్ వండర్ జోకోవిచ్ తిరిగి నంబర్ వన్ ర్యాంక్ లో నిలువగలిగాడు.

    2024 ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే జోకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్ సాధించడం ద్వారా..టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగనున్నాడు. ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ కంటే జోకోవిచ్ 2500 పాయింట్లతో ముందున్నాడు.

    ఫెదరర్, సెరెనాలను మించిన జోకో…

    ప్రపంచ టెన్నిస్ పురుషుల, మహిళల విభాగాలలో ఫెదరర్ 36 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిస్తే..సెరెనా విలియమ్స్ 35 ఏళ్ల వయసులో టాప్ ర్యాంక్ సాధించింది. ఈ ఇద్దరూ లేటు వయసులో సాధించిన రికార్డులను జోకోవిచ్ తన 37వ పుట్టినరోజుకు ముందే తెరమరుగు చేయగలిగాడు.

    2018లో ఫెదరర్ 36, 2017లో సెరెనా 35 సంవత్సరాల వయసులో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లుగా నిలిచారు.

    జోకోవిచ్ కు 450 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచే సత్తా ఉందంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి జోకోవిచ్ ను మించిన నిదర్శనం మరొకటి లేదు.

    Novak Djokovic Tennis News
    Previous Articleకెమికల్స్‌తో పండించిన ఫ్రూట్స్‌ను ఇలా కనిపెట్టొచ్చు!
    Next Article ప్లే-అఫ్ రౌండ్ కు చెన్నై చేరేదెలా?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.