ఆసీస్, ఆఫ్గాన్ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి
ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్గానిస్తాన్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రాహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 37.1 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. వర్షం ఎంతకీ తగ్గక ఈ మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించాల్సి వస్తే ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుంది.సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తప్పక గెలవాలి. ఓడిపోయినా లేక ఫలితం రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది.