Telugu Global
Sports

46 రన్స్‌ కే కుప్పకూలిన టీమిండియా

ఐదుగురు డకౌట్‌.. కివీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ లో పేలవ ప్రదర్శన

46 రన్స్‌ కే కుప్పకూలిన టీమిండియా
X

న్యూజిలాండ్‌ బౌలర్లు టీమిండియా నడ్డి విరిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్ట్‌ లో 46 పరుగులకు భారత్‌ ను ఆలౌట్‌ చేశారు. ఇండియా టీమ్‌ లో ఏకంగా ఐదుగురు డకౌట్‌ అయ్యారు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో టీమిండియా ఈ మధ్యకాలంలో అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ రేసులో రెండో స్థానంలో ఉన్న జట్టు ఒక ఇన్నింగ్స్‌ లో ఇంత తక్కువ స్కోర్‌ కు అలౌట్‌ అవడంతో భారత అభిమానులు నిరాశ చెందుతున్నారు. కివీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ .. ఫస్ట్‌ డే వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్‌ కూడా పడలేదు. గురువారం ఉదయం టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముందు రోజంతా భారీ వర్షం కురవడంతో పిచ్‌ పై కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరిగారు. జట్టు స్కోర్‌ 9 పరుగుల వద్ద కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టిమ్‌ సోథి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. రోహిత్‌ కేవలం రెండు పరుగులకే వెనుతిరిగాడు. ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌ మన్‌ విరాట్‌ కోహ్లీ విలియం ఓ రూర్కే బౌలింగ్‌ ఫిలిప్స్‌ కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం ఖాతా తెరువకుండానే హెడ్రీ బౌలింగ్‌ లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసిన ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ 13 పరుగులకు విలియం ఓ రూర్కే బౌలింగ్‌ లో పటేల్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రిషబ్‌ పంత్‌ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇండియాలో రిషబ్‌ పంత్‌, జైస్వాల్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా డకౌట్‌ అయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, జస్ప్రీత్‌ బూమ్రా ఒక పరుగు చేసి ఔటయ్యారు. మహ్మద్ సిరాజ్‌ 4 పరుగులతో నాటౌట్‌ గా ఉన్నారు. ఎక్స్‌ట్రాస్‌ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. టీమిండియా 31.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్‌ హెన్రీ 13.2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేల కూల్చాడు. విలియం ఓ రూర్కే 12 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సోథికి ఒక వికెట్‌ దక్కింది. టీమిండియా కుప్పకూలిన తర్వాత ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ మూడు ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా పది పరుగులు చేసింది. కాన్వే నాలుగు, లాథమ్‌ ఆరు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు.

First Published:  17 Oct 2024 1:44 PM IST
Next Story