టీ 20 వరల్డ్ కప్.. ఇండియా టార్గెట్ 106 పరుగులు
20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేసిన పాకిస్థాన్
టీ 20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ను భారత బౌలర్లు 105 పరుగులకే పరిమితం చేశారు. ఒకానొక దశలో పాకిస్థాన్ వంద స్కోర్ సాధిస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. నిదా దార్, సయేదా అరుబ్ షా తో కలిసి ఎనిమిదో వికెట్ కు 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం.. నర్షా సందు చివరి రెండు బాల్స్ కు ఆరు పరుగులు రాబట్టడంతో పాకిస్థాన్ వంద మార్క్ అధిగమించింది. పాకిస్థాన్ బ్యాటర్ లలో నిదా దార్ 34 బాల్స్ లో ఒక ఫోర్ తో 28 పరుగులు చేయగా, ముబీనా అలీ 17, అరేబ్ షా 14, ఫాతిమా సనా 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేయలేదు. ఇద్దరు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో అరుందతి రెడ్డి 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక పటేల్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశ శోభన ఒక్కో వికెట్ పడగొట్టారు.