Telugu Global
Sports

రహానే కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ

రంజీ ట్రోఫీలో ముంబయి జట్టులో టీమిండియా కెప్టెన్‌

రహానే కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ
X

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సహచరుడు అంజిక్యా రహానే కెప్టెన్సీలో ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. అవును! ముంబయి తరపున రోహిత్‌ శర్మ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. ఈనెల 23 నుంచి 26 వరకు జమ్మూకశ్మీర్‌తో తలపడే జట్టును ముంబయి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సోమవారం ప్రకటించింది. రహానే సారథ్యంలోని ఈ జట్టులో టీమిండియా స్టార్‌ ప్లేయర్స్‌ యశస్వీ జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శివమ్‌ దుబేకు చోటు దక్కింది. భారత్‌లో జరిగిన న్యూజిలాండ్‌ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ ను వైట్‌ వాష్‌ తో కోల్పోయిన టీమిండియా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీని 3-1 తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో ఫస్ట్‌ టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో కనీసం 50 పరుగుల మార్క్‌ కూడా చేరకుండానే ఆలౌట్‌ అయ్యింది. పలు టెస్టులను ఇన్నింగ్స్‌ తేడాతో, పది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

వన్‌డేలు, టీ 20ల్లో రాణిస్తున్న భారత జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శనకు, వరల్డ్ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ కు దూరం కావడానికి ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్‌ లేకపోవడమే కారణమని బీసీసీఐ నిర్దారణకు వచ్చింది. ఈక్రమంలో క్రికెటర్లందరూ డొమెస్టిక్‌ క్రికెట్‌, ముఖ్యంగా నాలుగు రోజుల పాటు జరిగే రంజీ మ్యాచుల్లో తప్పనిసరిగా బరిలోకి దిగాలనే నిబంధన తీసుకువచ్చింది. బీసీసీఐ ఆదేశాలతో స్టార్‌ ప్లేయర్లు రంజీల్లో బరిలోకి దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే రిషబ్‌ పంత్‌ ను ఢిల్లీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక మ్యాచ్‌ కు తమ కెప్టెన్‌గా ప్రకటించింది. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర, శుభ్‌మన్‌ గిల్‌ పంజాబ్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. అజింక్యా రహానె కెప్టెన్సీలోని ముంబయి రంజీ జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబె, హార్దిక్ టామోర్ (వికెట్ కీపర్‌), ఆకాశ్‌ ఆనంద్ (వికెట్ కీపర్), తనుశ్‌ కోటియన్, శామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, కర్ష్ కొఠారికి చోటు దక్కింది.

First Published:  20 Jan 2025 8:11 PM IST
Next Story