Telugu Global
Sports

సెంచరీ చేజార్చుకున్న రిషబ్‌ పంత్‌

కేఎల్‌ రాహుల్‌ కూడా ఔట్‌.. మళ్లీ కష్టాల్లో టీమిండియా

సెంచరీ చేజార్చుకున్న రిషబ్‌ పంత్‌
X

న్యూజిలాండ్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌లో ఆదిక్యంలోకి వచ్చినట్టు అనిపించిన టీమిండియా అంతలోనే మళ్లీ కష్టాల్లో పడింది. తీవ్రమైన మోకాలి నొప్పిని సైతం లెక్క చేయకుండా టీమ్‌ కోసం క్రీజ్‌ లోకి వచ్చిన రిషబ్ పంత్‌ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 105 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 99 పరుగులు చేసిన పంత్‌ ఓ రూర్క్‌ బౌలింగ్‌ లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ సైతం ఔటయ్యాడు. 16 బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేసిన రాహుల్‌ ఓ రూర్క్‌ బౌలింగ్‌ లో బ్లండెల్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే ఫీల్డ్‌ ఎంపైర్లు టీ బ్రేక్‌ ఇచ్చారు. రవీంద్ర జడేజా నాలుగు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. కివీస్‌ పై భారత జట్టు కేవలం 82 పరుగుల ఆదిక్యంలోనే ఉంది. రవీంద్ర జడేజ, రవిచంద్రన్‌ అశ్విన్‌ కు తోడు కుల్దీప్‌ యాదవ్‌ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ చేయగలిగితే ఇండియా ఈ మ్యాచ్‌ పై ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఇంకో 32 ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి ఉంది. ఈ మొత్తం ఓవర్లు టీమిండియా ఆలౌట్‌ కాకుండా బ్యాటింగ్‌ చేస్తే కివీస్‌ ముందు 200 పరుగుల కన్నా ఎక్కువ టార్గెట్‌ పెట్టే అవకాశం ఉంటుంది. ఆఖరి రోజు (ఆదివారం) పిచ్‌ స్పిన్‌ కు అనుకూలించే అవకాశముందని అంచనా వేస్తారు. మంచి టార్గెట్‌ ఇస్తేనే బౌలర్ల నుంచి అద్భుతాలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. టార్గెట్‌ తగ్గితే కివీస్‌ బ్యాటర్‌ లు ఆ టార్గెట్‌ ను ఈజీగా చేజ్‌ చేసే అవకాశం ఉంటుంది.

First Published:  19 Oct 2024 3:41 PM IST
Next Story