Telugu Global
Sports

రంజీ ట్రోఫీ.. బౌలర్‌ అన్సూల్‌ కాంబోజ్‌ కొత్త రికార్డు

ఒకే ఇన్నింగ్స్‌ లో పది వికెట్లు నేలకూల్చిన హర్యానా బౌలర్‌

రంజీ ట్రోఫీ.. బౌలర్‌ అన్సూల్‌ కాంబోజ్‌ కొత్త రికార్డు
X

రంజీ ట్రోఫీలో హర్యానా పేస్‌ బౌలర్‌ అన్సూల్‌ కాంబోజ్‌ కొత్త రికార్డు నెలకొల్పారు. ఒకే ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు పడగొట్టాడు. లాహ్లీలోని చౌదరి బన్సీలాల్‌ క్రికెట్‌ స్టేడియంలో కేరళతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌ లో హర్యానా బౌలర్‌ అన్సూల్‌ కాంబోజ్‌ ఈ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 30.1 ఓవర్లు బౌల్‌ చేసిన అన్సూల్‌ 49 పరుగులు ఇచ్చి పది వికెట్లు సొంతం చేసుకున్నారు. కేరళ ఓపెనర్‌ అపరాజిత్‌ ను ఫస్ట్‌ ఓవర్‌ లోనే ఔట్‌ చేసిన అన్సూల్‌ 291 పరుగుల వద్ద షౌన్‌ రోగర్‌ ను ఔట్‌ చేశాడు. మొత్తం పది వికెట్లలో మూడు క్లీన్‌ బౌల్డ్‌ లు ఉండగా, ఒక ఎల్‌బీడబ్ల్యూ, మిగతా ఆరు క్యాచ్‌ ఔట్లు ఉన్నాయి. కేరళ బ్యాట్స్‌మన్లలో అక్షయ్‌ చంద్రన్‌ 59, రోహన్‌ కున్నుమ్మల్‌ 55, కెప్టెన్‌ సచిన్‌ బాబి 52, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ 53, షౌన్‌ రోగర్‌ 42 పరుగులు చేశారు. హర్యానా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ 17, ధీరు సింగ్‌ ఆరు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. కేరళ బౌలర్లలో బన్సిల్‌ థంపి, బాసిల్‌ ఎన్‌పీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మరో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అయ్యాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఒకే ఇన్నింగ్స్‌ లో పదికి పది వికెట్లు దక్కించుకున్న ఆరో ఇండియన్‌ బౌలర్‌ అన్సూల్‌.

First Published:  15 Nov 2024 2:26 PM IST
Next Story