Telugu Global
Sports

ఘనంగా పీవీ సింధు పెళ్లి

భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ఘనంగా పీవీ సింధు పెళ్లి
X

భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధూ పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్ధాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకకు దాదాపు 14ం మంది మంది అతిథులు హాజరైనట్లు టాక్. వీరి పెళ్లి ఫోటోలను ఇరువైపుల కుంటుంబ సభ్యులు విడుదల చేయలేదు. ఉదయ్ సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీసీ సింధు-వెంకట దత్తసాయి పెళ్లి జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలోని వంద గదులతో రఫల్స్ సంస్థ ఈ భారీ రిసార్ట్ ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు.

వారి కోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్టు సమాచారం. ఈ రిసార్ట్ లో ఒక గదికి ఒక రోజు అద్దె రూ.1లక్ష వరకు ఉంటుందని సమాచారం.మంగళవారం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరగనుంది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

First Published:  23 Dec 2024 2:49 PM IST
Next Story