Sports

విజ‌యానికి ఇంక 28 ప‌రుగులే కావ‌ల్సిన స‌మ‌యంలో గిల్ గేర్ మార్చాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు సిక్సుల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసేశాడు. ఓ ఫోర్‌, టూ కొట్టి జురెల్ విజ‌య లాంఛ‌నం పూర్తి చేశాడు.

ఒక సిరీస్‌లో 600కు పైగా ప‌రుగుల‌ను గ‌వాస్క‌ర్‌, కోహ్లీ రెండేసిసార్లు సాధించారు. దిలీప్ స‌ర్దేశాయ్‌, రాహుల్ ద్ర‌విడ్ కూడా ఈ ఘ‌నత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 618 ప‌రుగులు చేసిన జైస్వాల్ వారి స‌ర‌స‌న నిల‌బ‌డ‌టం విశేషం.

ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది.

భార‌త టెస్ట్ క్రికెట్ జ‌ట్టులోకి కొత్త‌నీరు వ‌చ్చేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రాంచీలో మొద‌ల‌యిన నాలుగో టెస్ట్‌లో పేస‌ర్ ఆకాశ్‌దీప్ అరంగేట్రం చేశాడు.

తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది

చెస్‌లో సింగపూర్ త‌ర‌ఫున ఆడుతున్న అశ్వ‌త్ స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్మాస్టర్ జాక్ స్టోపాను చిత్తు చేశాడు. క్లాసికల్ చెస్లో పిన్న వయసులో గ్రాండ్ మాస్ట‌ర్‌ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు.

2023-24 సీజన్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం 26 మంది క్రికెటర్లతో కూడిన నాలుగు గ్రేడ్ల కాంట్రాక్టు వివరాలను బోర్డు సిద్ధం చేస్తోంది.