36ఏళ్ల తర్వాత భారత్‌లో కివీస్ విజయం
భారత్‌పై గెలుపుతో 36ఏళ్ల నిరీక్షణకు కివీస్ తెరదించింది. భారత్ గడ్డపై చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో గెలిచింది.
BY Vamshi Kotas20 Oct 2024 1:03 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Oct 2024 1:03 PM IST
టిమీండియాపై గెలుపుతో 36ఏళ్ల నిరీక్షణకు కివీస్ తెరదించింది. భారత్ లో చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ విజయం సాధించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ లోనూ భారత్ పై కివీస్ జట్టు విజయం సాధించలేదు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారతదేశంలో టిమీండియాను మూడు సార్లు ఓడించింది.
1969లో 167 పరుగుల తేడాతో కివీస్ తొలిసారి విజయం సాధించింది. 1988లో 136 పరుగుల తేడాతో రెండోసారి విజయం సాధించింది. ఇవాళ ఎనిమిది వికెట్ల తేడాతో మూడోసారి న్యూజిలాండ్ జట్టు టీమిండియాపై ఘనం విజయం సాధించింది. కాగా ఇరు జట్లు మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 25న ముంబయి వాంఖడే స్టేడియంలో జరగనుంది
Next Story