టెస్టుల్లో 9 వేల రన్స్ మార్క్ క్రాస్ చేసిన కింగ్ కోహ్లీ
కివీస్ తో ఫస్ట్ టెస్ట్ లో ఈ ఘనత సాధించిన స్టార్ బ్యాట్స్‌మన్
కింగ్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంకో మైలు రాయిని అధిగమించారు. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగుల మైలు రాయిని శుక్రవారం దాటేశారు. ఇండియా నుంచి టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్ మన్ గా ఘనత సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ రికార్డు నమోదు చేశారు. కింగ్ కోహ్లీ బెంగళూరు టెస్ట్ లో 102 బంతులను ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 70 పరుగులు చేసి ఫిలిప్స్ బౌలింగ్ లో ఔటయ్యారు. భారత్ తరపున సచిన్ టెండుల్కర్ 15,921 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 13,265 పరుగులు, సునీల్ గవాస్కర్ 10,122 పరుగులు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టెస్టుల్లో 9 వేల పరుగులకు పైగా చేసిన 18వ బ్యాట్స్‌మన్ కోహ్లీ. 197 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ ఘనత సాధించారు.