ఐపీఎల్ మెగా వేలం.. లాస్ట్ మినిట్‌లో లిస్ట్‌లోకి ఆ బౌలర్!
జోఫ్రా ఆర్చర్ ను ఏ టీమ్ దక్కించుకోనుందో?
BY Naveen Kamera22 Nov 2024 9:08 AM
X
Naveen Kamera Updated On: 22 Nov 2024 9:08 AM
ఐపీఎల్ మెగా వేలానికి కొన్ని గంటల ముందు విధ్వంసకర బౌలర్ కు వేలం జాబితాలో చోటు దక్కింది. ఇప్పుడు ఆ బౌలర్‌ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందా? ఏ టీమ్ లో ఆ బౌలర్ భాగమవుతాడా అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈనెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. మొత్తం 574 మంది క్రికెటర్లతో కూడిన షార్ట్ లిస్ట్ ను ఇదివరకే ప్రకటించారు. ఆ లిస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తో పాటు మార్క్ ఉడ్ ల పేర్లు లేవు. ఇంగ్లడ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత తాను ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉంటానని ఆర్చర్ సమాచారం ఇచ్చారు. తన బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా పేర్కొన్నాడు. గాయాల కారణంగా ఆర్చర్ కౌంటీలకు ఆడలేదు. గాయాల నుంచి కోలుకోవడంతోనే ఆయన ఐపీఎల్ తో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
Next Story