Telugu Global
Sports

ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌

వరుస ఫోర్లతో విరుచుకు పడుతున్న శాంసన్‌

ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌
X

బంగ్లాదేశ్‌ తో జరుగుతోన్న మూడో టీ 20లో టీమిండియా మూడో ఓవర్‌ లోనే ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయింది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌ లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ వరుస ఫోర్లతో రెండో ఓవర్‌ లో 16 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తంజిమ్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు ప్రయత్నించి మిడ్‌ వికెట్‌ లో మెహెది హసన్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగు బాల్స్‌ ఫేజ్‌ చేసిన శర్మ ఒక ఫోర్‌ తో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు బంతుల్లో ఒక ఫోర్‌, సిక్స్‌ తో 11 పరుగులతో, ఓపెనర్‌ సంజూ శాంసన్‌ 10 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు.టీమ్‌ ఇండియా మూడు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది.

First Published:  12 Oct 2024 7:20 PM IST
Next Story