బాక్సింగ్ డే టెస్ట్: ఆస్ట్రేలియా 151/1
తుది జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు
BY Raju Asari26 Dec 2024 9:08 AM IST
X
Raju Asari Updated On: 26 Dec 2024 10:20 AM IST
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్ ప్రారంభమైంది. 42 ఓవర్ల ముగిసే సరికి సమయానికి ఆస్ట్రేలియా 151/1 రన్స్ చేసింది. ఖవాజా (57*) లబు షేన్ (30*) క్రీజులో ఉన్నారు. సామ్ కాన్‌స్టాస్ 60 రన్స్ చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ప్రస్తుతం 1-1 గా సిరీస్ ఉండటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. పేలవ ఫామ్‌తో ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ తుది జట్టులో గిల్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించారు.
Next Story