Telugu Global
Sports

ఈశాన్య భారత్ వైపు బీసీసీఐ చూపు!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్ర్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

ఈశాన్య భారత్ వైపు బీసీసీఐ చూపు!
X

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్ర్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది...

దేశంలోని మారుమూల రాష్ట్ర్రాలకు సైతం క్రికెట్ ను విస్తరింప చేయటానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి నడుం బిగించింది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఏటా ఐపీఎల్ నిర్వహణ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ఈ మొత్తంలో సింహభాగాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలలో క్రికెట్ మౌలికసదుపాయాల కల్పన కోసం వెచ్చిస్తోంది.

ఆరు ఈశాన్య భారత రాష్ట్ర్రాలలో....

దేశంలోని ప్రధాన క్రికెట్ కేంద్రాలతో పాటు..వివిధ రాష్ట్ర్రాలలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో బీసీసీఐ సఫలమయ్యింది. బీసీసీఐ నిధులతో ప్రతిరాష్ట్ర్రంలోనూ ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటులో తనవంతు పాత్ర నిర్వర్తించింది. అయితే..కొండలు,గుట్టలు, కీకారణ్యాలతో నిండిన ఈశాన్య భారత్ కు సైతం క్రికెట్ ను విస్తరింప చేయాలని నిర్ణయించింది.

దేశం నలుమూలలకూ క్రికెట్ విస్తరణలో భాగంగా 2018-19 సీజన్ నుంచే ఈశాన్యభారత్ లోని ఆరు రాష్ట్ర్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలిలో చోటు కల్పించింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం జట్లు సైతం పాల్గొంటూ వస్తున్నాయి.

ఆరు రాష్ట్రాల్లో ఇండోర్ స్టేడియాలు...

ఈశాన్య భారత్ లోని ఆరు ప్రధాన (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం) రాష్ట్ర్రాలలో ఇండోర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి బీసీసీఐ కార్యదర్శి జే షా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగటం తనకు లభించిన గౌరవంగా, అదృష్టంగా జే షా పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక ఇండోర్ స్టేడియాలను..ఈ ఆరు రాష్ట్ర్ర్రాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇండోర్ నెట్స్, స్విమ్మింగ్ పూల్స్, ఏడాది పొడుగునా ఫిట్ నెస్ కార్యక్రమాల కోసం సదుపాయాలు, శిక్షకులు ఈ ఇండోర్ స్టేడియాలలో ఉండేలా చర్యలు తీసుకొంటామని, ఈశాన్య భారత ప్రాంతంలో క్రికెట్ ప్రమాణాల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

మిజోరంలో ఓ సరికొత్త క్రికెట్ పెవీలియన్ ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఈశాన్య భారత రాష్ట్ర్రాలలోని అసోంలో మాత్రమే ప్రపంచ ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఇప్పటి వరకూ బీసీసీఐ ఏర్పాటు చేయగలిగింది.

First Published:  21 May 2024 6:19 PM IST
Next Story