Telugu Global
Sports

ఇండియాతో ఫస్ట్‌ టెస్ట్‌ కు ఆస్ట్రేలియా టీమ్‌ ఇదే

బోర్డర్‌ - గవస్కర్‌ ట్రోఫీకి స్క్వాడ్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా

ఇండియాతో ఫస్ట్‌ టెస్ట్‌ కు ఆస్ట్రేలియా టీమ్‌ ఇదే
X

బోర్డర్‌ - గవస్కర్‌ ట్రోఫీ ఫస్ట్‌ టెస్ట్‌ కు ఆస్ట్రేలియా టీమ్‌ ను ప్రకటించారు. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ ఈ సిరీస్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌ ఈనెల 22 నుంచి పెర్త్‌ వేదికగా జరుగనుంది. ప్యాట్ కమిన్స్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టీమ్‌ లో స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ కారీ, జోష్‌ హాజెల్‌ వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషైన్‌, నాథన్‌ లయన్‌, మిచెల్‌ మార్ష్‌, నాథన్‌ మెస్‌స్వీనీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌ సభ్యులుగా ఉంటారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫికి అక్టోబర్‌ 25న ఇండియా టీమ్‌ ను ఇండియా సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టులలో విరాట్‌ కోహ్లీ, యశస్వీ జైశ్వాల్‌, అభిమణ్యు ఈశ్వరన్‌, ధ్రువ్‌ జురేల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్‌ బూమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రాణా, ప్రసీద్‌ కృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఈ సిరీస్‌ లో ఫస్ట్‌ టెస్ట్‌ పెర్త్‌ వేదికగా నవంబర్‌ 22 నుంచి 26 వరకు, రెండో టెస్ట్‌ అడిలైడ్‌ లో డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు, మూడో టెస్ట్‌ బ్రిస్బేన్‌ లో డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు, నాలుగో టెస్ట్‌ మెల్‌బోర్న్‌ లో డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు, ఐదో టెస్ట్‌ వచ్చే ఏడాది జనవరి మూడు నుంచి ఏడో తేదీ వరకు సిడ్నీ వేదికగా నిర్వహించనున్నారు. న్యూజిలాండ్‌ తో స్వదేశంతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ ను 3-0 తేడాతో కోల్పోయిన టీమిండియా టెస్ట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్ కు చేరాలంటే బోర్డర్‌ - గవర్కస్‌ ట్రోఫీని గెలిచి తీరాలి.

First Published:  10 Nov 2024 9:41 AM IST
Next Story