ఆర్చరీ వరల్డ్‌కప్: దీపికా కుమారికి రజతం
ఫైనల్స్ ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన లి జియామన్‌కు స్వర్ణం
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన ఆమెకు చైనా క్రీడాకారిణి లి జియామన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. లి ప్రతీ రౌండ్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో 0-6 తేడాతో దీపికాపై విజయం సాధించిన లి జియామన్ స్వర్ణం సాధించింది. సుమారు మూడేళ్ల తర్వాత ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన దీపికా అద్భుత ప్రదర్శన చేసింది.. చివరిసారి 2002లో కూతురు పుట్టడంతో వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఈసారి సెమీస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రతిహతంగా వచ్చినా.. ఫైనల్‌లో మాత్రం తడబాటుకు గురైంది. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనలక్ష పోటీ పడి ఐదు రజతాలను కైవసం చేసుకున్నది. ఒక కాంస్య పతకం కూడా సాధించింది. భారత్ తరఫున డోలా బెనర్జీ మాత్రమే స్వర్ణం గెలుచుకోవడం గమనార్హం..
ఒకే ఒక్క పథకంతో వెనుదిరిగిన భారత్
పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవరకు ఓటమి తప్పలేదు. సౌత్ కొరియా ఆర్చర్, పారిస్ కాంస్య పతక విజేత లీ వూ సియోక్ ధీరజ్ గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చివర్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో 2-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో ఐదుగురితో కూడిన భారత బృందం కేవలం ఒకే ఒక్క పథకంతో వెనుదిరిగింది. ముగ్గురు కాంపౌడ్, ఇద్దరు రికర్వ్ ఆర్చర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వీరిలో దీపికా కుమారి మాత్రమే రజతం గెలుచుకున్నది.