ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆ ముగ్గురికి చాన్స్
ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ కు చోటు
BY Naveen Kamera16 Oct 2024 4:51 PM IST
X
Naveen Kamera Updated On: 16 Oct 2024 4:51 PM IST
ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ హాల్ ఆఫ్ ఫేమ్ కేటగిరిలో మరో ముగ్గురు క్రికెటర్లకు చోటు ఇచ్చింది. ఈ మేరకు ఐసీసీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2024 క్లాస్ కేటగిరిలో వాళ్లకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ మాజీ టెస్ట్ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నీతూ లారెన్స్ డేవిడ్, సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నీతు డేవిడ్ 1995 నుంచి 2008 వరకు భారత మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. పది టెస్ట్ మ్యాచ్ లు ఆడి 41 వికెట్లు పడగొట్టారు. 97 వన్ డేల్లో 141 వికెట్లు తీసుకున్నారు.
Next Story