Telugu Global
Sports

బంగ్లాదేశ్‌ టార్గెట్‌ 298 పరుగులు

టీ 20ల్లో కొత్త రికార్డులు నెలకొల్పిన టీమిండియా

బంగ్లాదేశ్‌ టార్గెట్‌ 298 పరుగులు
X

బంగ్లాదేశ్‌ తో మూడు టీ 20ల సీరిస్‌ ను 2- 0 తేడాతో ఇ్పటికే గెలుచుకున్న టీమిండియా ఉప్పల్‌ లో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌ లో కొత్త రికార్డులు నమోదు చేసింది. సంజూ శాంసన్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దనాదన్‌ బ్యాటింగ్‌ తో వేగంగా స్కోర్‌ చేసిన భారత్‌.. ఆఖరి వరకు అదే జోరు కొనసాగించింది. హార్థిక్‌ పాండ్యా, రియాన్‌ పరాగ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. టీ 20 ల్లో ఇండియా తరపున ఇదే అత్యధిక స్కోర్‌. ఒకానొక దశలో 300 పరుగుల మార్క్‌ క్రాస్‌ చేస్తారని అనుకున్నా చివరి ఓవర్‌ లో రెండు వికెట్లు కోల్పోవడంతో 300లకు మూడు పరుగుల దూరంలో ఇండియా టీమ్‌ ఆగిపోయింది. 23 పరుగులకే ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయినా సంజూ శాంసన్‌ తో జత కలిసిన కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఒకే ఓవర్‌ లో సంజూ వరుసగా ఐదు సిక్సర్లు బాది 30 పరుగులు రాబట్టాడు. కేవలం 40 బంతుల్లోనే సంజూ సెంచరీ చేసి టాప్‌ స్కోరర్‌ గా నిలిచారు. సూర్యకుమార్‌ యాదవ్‌ 75, హార్థిక్‌ పాండ్యా 47, రియాన్‌ పరాగ్‌ 34 పరుగులు చేశారు. రింకూ సింగ్‌ ఇన్నింగ్స్‌ చివరి బంతిని సిక్సర్‌ బాది 297 పరుగుల మార్క్‌ కు స్కోర్‌ చేర్చారు. భారత బ్యాట్స్‌ మెన్‌ ల విధ్వంసంతో బంగ్లా ప్లేయర్లు ఫీల్డ్‌ లో తప్పుల మీద తప్పులు చేశారు. ఎక్స్‌ ట్రాస్‌ రూపంలో 17 పరుగులు ఇచ్చారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ప్రతి ఒక్కరు భారీ పరుగులు ఇచ్చారు. మెహదీ హసన్‌ మాత్రమే 4 ఓవర్లలో 45 పరుగులు ఇవ్వగా మిగతా వాళ్లు పెద్ద ఎత్తున పరుగులు ఇచ్చారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్‌ హసన్‌ సకీబ్‌ మూడు వికెట్లు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌, మహ్మదుల్లా తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 298 పరుగుల భారీ టార్గెట్‌ చేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మొదటి బంతికే ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయింది. పర్వేజ్‌ హొస్సేన్‌ ఇమాన్‌ మయాంక్‌ యాదవ్ బౌలింగ్‌ లో రియాన్‌ పరాగ్‌ క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యారు.

First Published:  12 Oct 2024 3:40 PM GMT
Next Story