Telugu Global
Science and Technology

సీక్రెట్ కోడ్.. సెర్చ్ బార్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేసే వాట్సాప్.. తాజాగా మరికొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో భాగంగా ‘సీక్రెట్ కోడ్’ అనే ప్రైవసీ ఆప్షన్ అలాగే అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో సరికొత్త సెర్చ్ బార్ వంటివి ఉండనున్నాయి.

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేసే వాట్సాప్.. తాజాగా మరికొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో భాగంగా ‘సీక్రెట్ కోడ్’ అనే ప్రైవసీ ఆప్షన్ అలాగే అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో సరికొత్త సెర్చ్ బార్ వంటివి ఉండనున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే..

యూజర్లు తమ పర్సనల్ చాట్స్‌ను హైడ్‌ చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే ‘చాట్‌లాక్‌’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్‌ యాప్‌ను ఇతరులు ఓపెన్‌ చేసినా సంబంధిత చాట్‌లు కనిపించకుండా పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘సీక్రెట్‌ కోడ్‌’ అనే మరో ఫీచర్‌ను తీసుకొస్తోంది. ‘చాట్‌ లాక్‌’ ఫీచర్‌తో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. చాట్‌లాక్ ద్వారా వ్యక్తిగత చాట్‌లు ఓపెన్ అవ్వకుండా లాక్‌ చేయొచ్చు. కానీ, సీక్రెట్ కోడ్ ఫీచర్ ద్వారా అసలు చాట్ అనేదే కనిపించదు. లాక్‌ చేయాలనుకున్న చాట్‌లన్నింటినీ సీక్రెట్‌కోడ్‌ ద్వారా లాక్‌ చేసేస్తే.. సెర్చ్‌బార్‌లో ఆ కోడ్ ఎంటర్‌ చేసేవరకూ ఆ చాట్స్ కనిపించవు. యూజర్లు తమకు నచ్చిన కోడ్స్‌తో చాట్స్‌ను హైడ్ లేదా లాక్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే వాట్సాప్‌లో ఉండే అప్‌డేట్ ట్యాబ్ కోసం కొత్త సెర్చ్ ఫీచర్‌ రాబోతోంది. దీని సాయంతో అప్‌డేట్‌ ట్యాబ్‌లో ఉండే స్టేటస్‌లు, ఛానెల్స్ లోని కంటెంట్‌ను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.

వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం ఈ సెర్చ్ బటన్.. యాప్‌లో పైభాగాన ఉంటుంది. ఇక్కడ స్టేటస్ అప్‌డేట్స్, ఫాలో అవుతున్న ఛానెల్స్‌లోని కంటెంట్, కొత్త ఛానెల్స్.. వంటివి సెర్చ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికి టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలో రాబోయే వాట్సాప్ అప్‌డేట్‌తో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.

First Published:  11 Oct 2023 5:44 PM IST
Next Story