Telugu Global
Science and Technology

వాట్సాప్​లో టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లు! ఎలా పనిచేస్తాయంటే..

వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే వీటిలో టెక్స్ట్ ఫార్మాటింగ్‌కు సంబంధించిన ఫీచర్లు చాలా తక్కువ. రీసెంట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెక్స్ట్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లు కనిపించాయి.

వాట్సాప్​లో టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లు! ఎలా పనిచేస్తాయంటే..
X

వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే వీటిలో టెక్స్ట్ ఫార్మాటింగ్‌కు సంబంధించిన ఫీచర్లు చాలా తక్కువ. రీసెంట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెక్స్ట్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లు కనిపించాయి. ఇవెలా పనిచేస్తాయంటే.

టెక్స్ట్‌ను హైలైట్ చేయడం, కోట్ చేయడం, ఇటాలిక్, బోల్డ్, లిస్టింగ్.. వంటి ఫీచర్లు వాట్సాప్‌లో టెక్స్ట్‌ను ఎక్కువగా పంపే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటాయి. కొత్తగా రానున్న టెక్స్ట్ ఫార్మాట్ ఫీచర్లలో ‘కోడ్ బ్లాక్స్’ అనే కొత్త ఫీచర్ ఉంది. వాట్సాప్‌లో కోడింగ్ టెక్స్ట్‌ను పంపేందుకు వీలుగా ఈ ఫీచర్ తీసుకొచ్చారు.

కోడ్ బ్లాక్స్ ఫీచర్ ద్వారా టెక్ట్స్​ను కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. డెవలపర్లు.. వాట్సాప్‌ ద్వారా కోడ్స్‌ను షేర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ పనికొస్తుంది. టెక్ట్స్​కు ముందు, వెనుక సెమికాలన్ సింబల్ వాడడం ద్వారా కోడ్‌ను సెపరేట్‌గా టైప్ చేసే వీలుటుంది.

వాట్సాప్‌లో రానున్న మరో ఫీచర్ ‘కోట్ బ్లాక్స్’. మీకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్​​లో కొంత భాగాన్ని కోట్ చేస్తూ రిప్లై ఇవ్వాలనుకుంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మీరు రిప్లై ఇవ్వాలనుకుంటున్న టెక్ట్స్​కు ముందు గ్రేటర్​ దేన్ ‘>’ సింబల్ పెడితే ఆ టెక్స్ట్ హైలైట్ అయ్యి కనిపిస్తుంది.

టెక్స్ట్‌ను లిస్ట్ లేదా బుల్లెట్ పాయింట్స్ రూపంలో పంపేందుకు వీలుగా వాట్సాప్ మరో ఫీచర్‌‌ను తీసుకురానుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో మాదిరిగా టెక్స్ట్ లోని ప్రతి లైన్​కు ముందు స్టార్ ‘*’ లేదా హైఫన్ ‘–’ సింబల్స్​ను పెడితే టెక్స్ట్.. లిస్ట్ రూపంలో కనిపిస్తుంది.

ఇకపోతే వాట్సాప్‌లో ఇప్పటికే కొన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్ ఫీచర్లు ఉన్నాయి. టెక్ట్స్​ను బోల్డ్ చేయడానికి పదానికి ముందు, వెనక స్టార్‘ * ’సింబల్స్ ను పెట్టొచ్చు. అలాగే ఇటాలిక్ టెక్స్ట్ కోసం పదానికి ముందు వెనుక అండర్​స్కోర్ ‘ _ ’ సింబల్స్ పెట్టాలి.

First Published:  18 Jan 2024 9:06 AM IST
Next Story