Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్స్!

వాట్సాప్‌లో స్పామ్‌ కాల్స్‌ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి స్పామ్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ మోసాలకు అవకాశం ఉంటుంది.

WhatsApp Silence Unknown Callers: వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్స్!
X

WhatsApp Silence Unknown Callers: వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్స్!

వాట్సాప్‌లో స్పామ్‌ కాల్స్‌ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి స్పామ్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ మోసాలకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని అరికట్టడానికి వాట్సాప్‌.. ఇటీవల కొన్ని ప్రైవసీ ఫీచర్స్ యాడ్ చేసింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను డీఫాల్ట్‌గా సైలెంట్ చేసేలా సెట్టింగ్స్ అప్‌డేట్ చేసింది.

లేటెస్ట్ ప్రైవసీ ఫీచర్స్ పొందడం కోసం ముందుగా వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. తర్వాత సెటింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్తే కాల్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్‌’ ఫీచర్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే తెలియనివారి నుంచి వచ్చే కాల్స్‌ కేవలం లాగ్స్‌లో మాత్రమే కనిపిస్తాయి. రింగ్‌ కావు.

ఇకపోతే ‘చూజ్‌ హూ కెన్‌ కాంటాక్ట్‌ యూ’ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌ ద్వారా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో చేర్చకుండా అడ్డుకోవచ్చు. ‘కంట్రోల్‌ యువర్‌ పర్సనల్‌ ఇన్ఫో’ అనే ఆప్షన్‌తో ప్రొఫైల్‌ ఫొటో, లాస్ట్‌ సీన్‌ స్టేటస్‌, రీడ్‌ రిసీప్ట్స్‌ను ఎవరెవరు చూడొచ్చో సెట్ చేసుకోవచ్చు. ‘యాడ్‌ మోర్‌ ప్రైవసీ టు యువర్‌ చాట్స్‌’ ఆప్షన్ ద్వారా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ బ్యాకప్స్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. ‘యాడ్‌ మోర్‌ ప్రొటెక్షన్‌ టు యువర్‌ అకౌంట్‌’ సెట్టింగ్ ద్వారా వాట్సాప్‌లో టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. వాట్సప్‌ డేటా హ్యాక్ అవ్వకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుంది. అలాగే పర్సనల్ వాట్సాప్ చాట్స్ ఎవరికి కనిపించకుండా హిడెన్ అండ్ లాక్ చాట్స్ ఆప్షన్ కూడా వాట్సాప్ జత చేసింది.

First Published:  10 July 2023 11:15 AM IST
Next Story