Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ ఫీచర్లివే!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వీటిలో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ వంటి ఫీచర్లున్నాయి.

వాట్సాప్‌లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ ఫీచర్లివే!
X

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వీటిలో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ వంటి ఫీచర్లున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే.

వాట్సాప్ గతంలో ప్రకటించిన ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ) వీడియో కాలింగ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వీడియో కాలింగ్‌ చేసేటప్పుడు భిన్నమైన ఎక్స్‌పీరియెన్స్‌ను పొందొచ్చు. వీడియో లుక్‌లో కరెక్షన్స్, ఫేషియల్ ఫిల్టర్స్ వంటివి వాడుకోవచ్చు. అలాగే ఈ ఫీచర్ సాయంతో వీడియో వెనుక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకునే వీలుంటుంది.

యూజర్ నేమ్స్

వాట్సాప్‌లో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. యూజర్ నేమ్స్. ఫోన్‌ నెంబర్‌‌తో పనిలేకుండా యూజర్‌‌నేమ్ సాయంతో వాట్సాప్‌లో ఛాట్ చేసుకునేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా నెంబర్‌‌ లేకుండా ఇతరులతో ఛాట్ చేసుకునేందుకు ఈ యూజర్ నేమ్స్ పనికొస్తాయి.

ఏఐ స్టూడియో

వాట్సాప్ తీసుకురాబోతున్న మరో కొత్త ఫీచర్‌ ఏఐ స్టూడియో. రీసెంట్‌గా తీసుకొచ్చిన మెటా ఏఐ ఛాట్ బాట్‌ను మరింత అప్‌డేట్ చేస్తూ వాట్సాప్ ఈ ఫీచర్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఏఐ స్టూడియో ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు పర్సనలైజ్డ్ చాట్ బాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.

డబుల్ ట్యాప్ టు రియాక్ట్

ఇకపోతే ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా వాట్సాప్ లో కూడా డబుల్ ట్యాప్ రియాక్షన్ ఫీచర్ రానుంది. వాట్సాప్ మెసేజ్‌పై రెండు సార్లు ట్యాప్ చేసి రియాక్షన్స్ తెలపొచ్చు. డబుల్ ట్యాప్‌కు హార్ట్ సింబల్ డీఫాల్ట్ రియాక్షన్‌గా ఉంటుంది. యూజర్లు దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.

First Published:  1 Aug 2024 12:30 AM GMT
Next Story