వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్స్
వరుస అప్ డేట్స్ తో వాట్సప్ యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది. రోజుల వ్యవధిలో బోలెడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది.
వరుస అప్ డేట్స్ తో వాట్సప్ యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది. రోజుల వ్యవధిలో బోలెడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. వాట్సాప్ లో రీసెంట్‌గా వచ్చిన ఫీచర్స్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచుతున్నాయి.
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో గ్రూపుల్లో ఉండే కాంటాక్ట్‌లను ఇతరులకు కనిపించకుండా దాచేయొచ్చు. వాట్సప్ కమ్యూనిటీస్‌లోనూ లిమిటెడ్‌గా ఉండొచ్చు. వాట్సప్ కమ్యూనిటీల్లో నెంబర్ కనిపించకుండా దాచొచ్చు. దీనిపై వాట్సప్ సీఈఓ విల్ కాత్కార్ట్ మాట్లాడుతూ.. ''ఎవరైనా వ్యక్తి తన ప్రమేయం లేకుండానే గ్రూప్‌లో యాడ్ అయితే అడ్మిన్ కు తప్ప వేరెవ్వరికీ తెలియకుండా వారి మొబైల్ నెంబర్‌ను హైడ్ చేసుకోవచ్చు'' అని తెలిపారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. మెసేజింగ్ యాప్ అన్ని యాక్టివిటీలను పరిశీలిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన వాట్సప్ బీటా వెర్షన్ 2.22.17.23లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.
ఇక దీంతో పాటు వాట్సాప్ లో మరో ప్రైవసీ ఫీచర్ కూడా వచ్చింది . వాట్సాప్ గ్రూపులోంచి ఎవరైనా 'లెఫ్ట్' అయితే, అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా కొత్త ఫీచర్ రాబోతుంది. దీనివల్ల మిగతా సభ్యులకు తెలియకుండానే గ్రూపులోంచి వెళ్లిపోవచ్చు.
ఇకపోతే యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ తీసుకొచ్చిన వ్యూవన్స్ మెసేజ్‌లతో మరో ప్రాబ్లెమ్ వచ్చిపడింది. సాధారణంగా వ్యూ వన్స్ మెసేజ్‌లను ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది. ఆ తర్వాత అవి ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. అయితే, కొందరు వాటిని స్క్రీన్‌షాట్స్ తీయడం వల్ల వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ అయినప్పటికీ ఇద్దరి మధ్యా జరిగిన చాట్.. ఫోన్‌లో స్క్రీన్‌షాట్ రూపంలో సేవ్ అయ్యి ఉంటుంది. అందువల్ల 'వ్యూ వన్స్ మెసేజ్' ఫీచర్‌కు అర్థం లేకుండా పోతోంది. అందుకే ఇకపై ఈ ఫీచర్ వాడుకుంటే స్క్రీన్‌షాట్ తీయకుండా ఉండేలా అప్‌డేట్ చేస్తున్నారు.
ఇక చివరిగా వాట్సాప్ తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్.. చాట్ పేజీలో కెమెరా ఆప్షన్. ఇప్పటివరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు సెక్షన్లు మాత్రమే కనిపించేవి. తాజా అప్‌డేట్‌లో చాట్స్‌కు ఎడమవైపు కెమెరా ఐకాన్ కూడా యాడ్ అయింది. చాట్ పేజ్‌ని కుడివైపు స్వైప్ చేస్తే వాట్సాప్‌లో కెమెరా ఒపెన్ అవుతుంది. దీంతో కావాల్సిన ఫొటోను క్లిక్ చేసి, స్టేటస్‌గా పెట్టుకోవచ్చు లేదా ఇతరులతో షేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్ చేయాలంటే ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేయడం లేదా స్టేటస్ పేజ్‌లోకి వెళ్లి కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాల్సిందే. ఈ తాజా అప్‌డేట్‌తో కెమెరాను సులువుగా యాక్సెస్ చేసే వీలుంటుంది.