Telugu Global
Science and Technology

ఇ–మెయిల్ లాగిన్, ఆల్టర్నేటివ్ ప్రొఫైల్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాటిలో ఫోన్ నెంబర్ లేకుండా లాగిన్ చేసే ఆప్షన్ , కమ్యూనిటీ చాట్స్ అర్కైవ్, ఆల్టర్నేటివ్ ప్రొఫైల్ వంటి ఫీచర్లున్నాయి.

ఇ–మెయిల్ లాగిన్, ఆల్టర్నేటివ్ ప్రొఫైల్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాటిలో ఫోన్ నెంబర్ లేకుండా లాగిన్ చేసే ఆప్షన్ , కమ్యూనిటీ చాట్స్ అర్కైవ్, ఆల్టర్నేటివ్ ప్రొఫైల్ వంటి ఫీచర్లున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే..

నెంబర్ లేకుండా లాగిన్

సాధారణంగా యూజర్లు కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ లాగిన్‌ చేయాలంటే ఫోన్‌ నెంబర్‌తో వెరిఫై చేసుకోవడం తప్పనిసరి. మొబైల్ నెంబర్‌‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది. అయితే ఎప్పుడైనా ఫోన్‌ నంబర్‌ పనిచేయనప్పుడు, నెట్‌వర్క్ లేనప్పుడు వాట్సాప్ లాగిన్‌ కోసం ఇ–మెయిల్‌ను వాడుకునేలా కొత్త ఫీచర్ పై పని చేస్తోంది వాట్సాప్. ఈ ఫీచర్‌ ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

ఇ–మెయిల్ ద్వారా వాట్సాప్‌ లాగిన్ అవ్వడం కోసం యూజర్లు ఫోన్‌ నంబర్‌కు బదులుగా మెయిల్‌ ఐడీ టైప్‌ చేయాలి. తర్వాత మెయిల్‌ ఓపెన్‌ చేసి వెరిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేస్తే.. వాట్సాప్‌ లాగిన్‌ అవుతుంది.

కమ్యూనిటీ చాట్ అర్కైవ్

ఇకపోతే వాట్సాప్‌ కమ్యూనిటీ గ్రూప్స్‌లో చాలామంది యాక్టివ్‌గా ఉంటారు. ఇలాంటి గ్రూప్ చాట్స్ నుంచి ఎక్కువ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిని కనిపించకుండా ఆర్కైవ్ లేదా హైడ్ చేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకురానుంది.

చాట్ ఓపెన్ చేయగానే పదులకొద్దీ గ్రూప్ మెసేజ్‌లు కనిపించకుండా చాట్ లిస్ట్ నుంచి గ్రూప్ చాట్‌ను హైడ్ చేసుకోవచ్చు అలాగే నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. కమ్యూనిటీ గ్రూప్ చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి త్రీ-డాట్స్‌ క్లిక్ చేస్తే, ‘ఆర్కైవ్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే చాట్ హైడ్ అయ్యి సేవ్ అవుతుంది.

ఆల్టర్నేటివ్ ప్రొఫైల్

ఇతర యూజర్లకు పర్సనల్ వివరాలు తెలియకుండా ఉండేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ తీసుకురానుంది. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు మీ ప్రోఫైల్ చూసినప్పుడు వారికి మీ ఫోటో, ‘అబౌట్‌’లోని టెక్స్ట్ కనిపించకుండా డూప్లికేట్ ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే ఇతరులెవరైనా మెసేజ్ చేసినప్పుడు వారికి రియల్ ఫొటో, నేమ్‌కు బదులు ఆల్టర్నేటివ్ పిక్, నేమ్ కనిపిస్తాయి. చిన్నచిన్న అవసరాల కోసం కొన్నిసార్లు వాట్సాప్‌లో టెంపరరీ చాట్ చేయాల్సివస్తుంది. అలాంటి సమయాల్లో ప్రైవసీ కోరుకునే వాళ్లు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

First Published:  8 Nov 2023 3:18 AM GMT
Next Story