రెండోసారి మెసేజ్ చూడకుండా.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!
WhatsApp View Once feature: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పర్సనల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా ఫొటోలకు 'వ్యూ వన్స్' ఫీఛర్‌ను ప్రవేశపెట్టింది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పర్సనల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా ఫొటోలకు 'వ్యూ వన్స్' ఫీఛర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇదే ఫీచర్.. మెసేజ్‌లకు కూడా తీసుకురానుంది. ఇదెలా పనిచేస్తుందంటే..
వాట్సాప్ తీసుకొచ్చిన 'వ్యూ వన్స్' మెసేజ్ అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్‌లను ఒకసారి మాత్రమే చూసే వీలుంటుంది. అవతలి వాళ్లు చూసిన తర్వాత మెసేజ్ మాయపైపోతుంది. వాట్సాప్ బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
వ్యూ వన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లను అవతలి వాళ్లు కొన్ని సెకన్ల పాటు మాత్రమే చూడగలరు. ఆ మెసేజ్‌ను షేర్ లేదా ఫార్వార్డ్ చేయలేరు. టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ అమలు చేయడానికి ప్రత్యేకించి ఒక సెండ్ బటన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చని సమాచారం.
ఇదిలా ఉంటే రీసెంట్‌గా అనౌన్స్ చేసిన వాట్సాప్ 'మెసేజ్ యువర్ సెల్ఫ్' ఫీచర్ ఇటీవల కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు తాముగా టెక్స్ట్‌లు, మీడియా, నోట్స్‌ను పంపుకోవచ్చు. 'wa.me/+91' తర్వాత వాళ్ల 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే మెసేజ్ పంపుకోనే వీలుంది. మరికొద్ది రోజుల్లో వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ కూడా అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది.