వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి `ఎడిట్` బటన్
WhatsApp Edit Messages: ఒకవేళ అక్షర దోషం ఉన్నా, పొరపాటుగా మెసేజ్ పంపినా వాటిని డిలీట్ చేయడం మినహా మరో దారిలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ ఈ కొత్త ఎడిట్ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేసింది.

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి `ఎడిట్` బటన్
వాట్సాప్ యూజర్లకు ఇదొక గుడ్ న్యూస్ లాంటిదే. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో అవసరమైతే మార్పులు చేసుకునే అవకాశం.. అంటే ఎడిట్ ఆప్షన్.. ఇప్పుడు అందుబాటులోకి రానుంది. ఈ వారం రోజుల్లోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు మెటా సీఈవో జుకర్ బర్గ్ సోమవారం ప్రకటించారు. ఇప్పటికే ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉందని, ఈ వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.
ఎలా ఉపయోగపడుతుందంటే..
వాట్సాప్‌లో పంపే మెసేజీల్లో ఏవైనా తప్పులు ఉంటే.. మెసేజ్ అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర దోషం ఉన్నా, పొరపాటుగా మెసేజ్ పంపినా వాటిని డిలీట్ చేయడం మినహా మరో దారిలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ ఈ కొత్త ఎడిట్ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుందంటే..
వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే copy, forward వంటి ఆప్షన్లు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇకపై వాటితోపాటు edit ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి.. పంపిన మెసేజ్‌లో తప్పులున్నా.. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటిని సరిచేసుకోవచ్చు. మెసేజ్ పంపిన 15 నిమిషాలలోపు ఎన్నిసార్లయినా ఎడిట్ చేసుకోవచ్చని జుకర్ బర్గ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
IT’S HERE Message Editing is rolling out now.
— WhatsApp (@WhatsApp) May 22, 2023
You now get up to 15 minutes after sending a message to edit it. So you don’t have to worry if you duck it up pic.twitter.com/JCWNzmXwVr