Telugu Global
Science and Technology

వాట్సాప్ ఫీచర్ రీఎంట్రీ!

పర్సనల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజ‌ర్ల కోసం ఓ పాత ఫీచ‌ర్ తిరిగి అందుబాటులోకి తేనుంది.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు!
X

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు!

పర్సనల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజ‌ర్ల కోసం ఓ పాత ఫీచ‌ర్ తిరిగి అందుబాటులోకి తేనుంది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న మల్టిపుల్ చాట్ సెలక్షన్ ఫీచర్‌‌ను వాట్సాప్ గతంలో తొలగించింది. అయితే ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి తీసుకురాబోతుంది.

వాట్సాప్‌లో ఒక‌టి కంటే ఎక్కువ మెసేజ్‌లను ఒకేసారి సెలక్ట్ చేసి ఇత‌రుల‌కు షేర్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి మ‌ల్టీపుల్ చాట్ సెల‌క్షన్ ఫీచ‌ర్ ఉండేది. అయితే డెస్క్‌టాప్ యాప్ నుంచి ఈ వాట్సాప్ ఫీచ‌ర్ తొల‌గించారు. కానీ, ఇప్పుడు యూజ‌ర్ల నుంచి రిక్వెస్ట్‌లు రావ‌డంతో తిరిగి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి తేనున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

ప్రస్తుతం మొబైల్ యాప్‌, వెబ్ వ‌ర్షన్లలో ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌‌లో మరికొన్ని మార్పులు కూడా చేయబోతున్నారు. . త్వర‌లోనే యూజ‌ర్లకు సెలెక్ట్ చాట్స్ అందుబాటులోకి రానుంది. యూజ‌ర్లు ఒకేసారి ఒక‌టికంటే ఎక్కువ మెసేజ్‌లు ఎంపిక చేసి ఫార్వర్డ్, డిలీట్ లేదా మ్యూట్ చేయొచ్చు.

ఇకపోతే వాట్సాప్ యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన టెక్ట్స్‌, మీడియా ఫైల్స్‌, వెబ్ లింక్‌లు ఇత‌రులు చూసేలా స్టేట‌స్‌లో పెడుతుంటారు. ఈ స్టేట‌స్‌ల‌పై అభ్యంత‌రాలు ఉంటే యూజ‌ర్లు రిపోర్ట్ చేసేలా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌‌ను తీసుకొస్తున్నట్టు గతంలో అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ ఫీచర్ కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

First Published:  3 Jan 2023 5:58 PM IST
Next Story