Telugu Global
Science and Technology

పంపిన మెసేజ్ ఎడిట్ చేయొచ్చు! వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

ఈ కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా యూజర్లు తాము పంపిన మెసేజ్‌లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకునే వీలుంటుంది.

WhatsApp
X

వాట్సాప్‌

మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంటుంది. రీసెంట్‌గానే ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌‌ను తీసుకురానున్నట్టు అప్‌డేట్ ఇచ్చింది. అదేంటంటే..

యూజర్ల ప్రైవసీ, యాప్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు వాట్సాప్.. మెసేజ్‌ను ఎడిట్ చేసే ఫీచర్‌‌ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్‌‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డెవలపర్లు పనిచేస్తున్నారని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఈ కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా యూజర్లు తాము పంపిన మెసేజ్‌లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకునే వీలుంటుంది. వాట్సాప్‌లో ఇప్పటికే పంపిన మెసేజ్ డిలీట్ చేసే ఫీచర్ ఉంది.

ఒకవేళ డిలీట్‌కు బదులు ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింట్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

First Published:  28 Feb 2023 2:03 PM IST
Next Story